మీరు తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఎస్సీ విద్యార్థులా? డిగ్రీ లేదా పీజీ పూర్తయిందా? విదేశాల్లో పీజీ లేదా పీహెచ్డీ చేయడం మీ లక్ష్యమా? అర్థిక సమస్యలు మీ గమ్యానికి అవరోధమా? అయితే మీకోసం అంబేద్కర్ విద్యానిధి సిద్ధంగా ఉంది. దీనిద్వారా విదేశాల్లో ఉన్నత విద్యను ఉచితంగా అభ్యసించవచ్చు.
సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన ఎస్సీ వర్గాలు ఉన్నత విద్య అభ్యసించడమంటే గగనమే. అందులోనూ పేరొందిన విదేశీ విశ్వవిద్యాలయాల్లో చదవాలంటే వాళ్ల స్థోమతకు మించిన వ్యవహారమే. అయితే సాంఘిక అసమానతలను తగ్గించాలంటే వెనుకబడిన అల్పాదాయ వర్గాలవారిని ఉన్నత విద్యావంతులను చేయడం ఎంతో అవసరం. దీనిలో భాగంగానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధిని ఎస్సీల కోసం అందిస్తోంది.
ఈ స్కీమ్ ద్వారా ఏడాదికి వంద మంది ఎస్సీ అభ్యర్థులు విదేశాల్లో చదువుకోవచ్చు.
ఎంపిక కావాలంటే...
ఆదాయం: రూ.2 లక్షలలోపు వార్షిక ఆదాయం ఉండాలి.
వయసు: జులై 1 నాటికి 35 ఏళ్లకు మించరాదు
విద్యార్హత: 60 శాతం మార్కులతో ఇంజినీరింగ్/మేనేజ్మెంట్/ప్యూర్ సైన్సెస్/ అగ్రికల్చర్ సైన్సెస్/ మెడిసిన్ అండ్ నర్సింగ్/ సోషల్ సైన్సెస్/ హ్యుమానిటీస్‌లో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించినవాళ్లు పీజీ కోర్సులు చేయడానికి అర్హులు. పైన పేర్కొన్న కోర్సుల్లో 60 శాతం మార్కులతో పీజీ ఉత్తీర్ణులు పీహెచ్డీ చేసుకోవడానికి అర్హులు.
ఈ స్కీమ్‌ద్వారా లబ్ధి పొందడానికి కుటుంబానికి ఒకరు చొప్పున మాత్రమే అర్హులు.
ఏయే దేశాల్లో...
విద్యానిధికి ఎంపికైనవాళ్లు యూఎస్ఏ, యూకే, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్ దేశాల్లో నచ్చిన చోట చదువుకునే వీలుంది.
ఇవి తప్పనిసరి...
* టోఫెల్/ఐఈఎల్టీఎస్/జీఆర్ఈ/జీమ్యాట్ స్కోర్ ఉండాలి.
* విదేశాల్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీలో ప్రవేశానికి అర్హత లభించాలి.
* చలామణిలో ఉన్న పాస్‌పోర్టు తప్పనిసరి.
జత చేయాల్సినవి...
* కుల ధ్రువీకరణ (ఎస్సీ) సర్టిఫికెట్
* ఆదాయ ధృవీకరణ సర్టిఫికెట్
* పుట్టిన తేదీ సర్టిఫికెట్
* ఆధార్ కార్డు
* ఈ-పాస్ ఐడీ నెంబర్
* స్థానికత ధృవీకరణ సర్టిఫికెట్
* పాస్‌పోర్ట్ కాపీ
* టెన్త్, ఇంటర్, డిగ్రీ, పీజీ సర్టిఫికెట్లు
* టోఫెల్/జీఆర్ఈ/జీమ్యాట్/ఐఈఎల్టీఎస్ స్కోర్ కార్డు
* ఫారిన్ యూనివర్సిటీ నుంచి అడ్మిషన్ ఆఫర్ లెటర్ (ఐ-20 లేదా అడ్మిషన్ పొందినట్టు ఏదైనా ధృవీకరణ పత్రం)
* తాజా ట్యాక్స్ అసెస్మెంట్ కాపీ
* ఏదైనా జాతీయ బ్యాంకు పాస్ బుక్
* స్కాన్‌చేసి, అప్లోడ్ చేసిన ఫొటో
ఎంపిక ఇలా...
రాష్ట్రస్థాయిలో స్క్రీనింగ్ కమిటీ అర్హులైన అభ్యర్థులను ఎంపికచేస్తుంది. దీనికి రాష్ట్ర గిరిజన సంక్షేమ ప్రధాన కార్యదర్శి ఛైర్మన్‌గా ఉంటారు. ఉన్నత విద్యామండలి కార్యదర్శి, జేఎన్టీయూ వీసీ, సోషల్ వెల్ఫేర్ కమిషనర్, టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్, ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్లు సభ్యులుగా ఉంటారు.
స్కాలర్షిప్ విలువ
ఎంపికైనవారికి ఒక్కొక్కరికి రూ.10 లక్షలు చొప్పున చెల్లిస్తారు. రెండు వాయిదాల్లో ఈ మొత్తాన్ని అందిస్తారు. ల్యాండింగ్ పెర్మిట్/ఐ-94 కార్డు (ఇమిగ్రేషన్ కార్డు) చూపినవాళ్లకు తొలి విడతగా రూ.5 లక్షలు చెల్లిస్తారు. ఆ తర్వాత ఫస్ట్ సెమిస్టర్ ఫలితాలను బట్టి మరో ఐదు లక్షలు చెల్లిస్తారు.
* తక్కువ వడ్డీకి రూ.5 లక్షల ఎడ్యుకేషన్ లోన్ కూడా జాతీయ బ్యాంకుల నుంచి మంజూరు చేస్తారు.
* కోర్సులో చేరడానికి వెళ్లేందుకు ఎకానమీ క్లాస్ విమాన టికెట్ కూడా పొందొచ్చు.
* చెల్లుబాటయ్యే వీసా సమర్పించిన తర్వాత దాని ఫీజును కూడా అభ్యర్థులకు తిరిగి చెల్లిస్తారు.
దరఖాస్తులు చేయడానికి చివరి తేదీ: ఆగస్ట్ 5, 2014
వెబ్సైట్: www. epass.cgg.gov.in/
www. telanganaepass.cgg.gov.in/

1 Comments
http://employment-news-to-day.blogspot.in/2015/03/air-india-limited-invited-for-Various-Posts.html